జగన్‌ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా: చంద్రబాబు నాయుడు | Oneindia Telugu

2017-11-11 2

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Friday press meet said that state government can't takeover YSRCP chief YS Jaganmohan Reddy's assets.

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆస్తులు మనం స్వాధీనం చేసుకోవడం కష్టమని చెప్పారు.
జగన్‌ అవినీతి ఆస్తుల్ని, సాక్షి పత్రికను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. అవి సీబీఐ, ఈడీ పరిధిలో ఉన్నాయని, అందుకే మనం ఏం చేయలేకపోతున్నామన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించి ఎప్పుడో స్వాధీనం చేసుకునేవారిమన్నారు. సత్యం వంటి స్కాముల్లో చేసినట్టే కేంద్రం ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఆ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉందని చంద్రబాబు అన్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన భారీ అవినీతిపరులందరి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, త్వరలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ మార్గాల్లో ఎంత సంపాదించినా ఎప్పటికైనా పట్టుబడితే ఆ డబ్బు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటేనే అవినీతి తగ్గుతుందన్నారు. అందుకే నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిచ్చానన్నారు.పారడైజ్ పేపర్లలో జగన్ పేరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని చంద్రబాబు అన్నారు. తాను పాజిటివ్ ఇమేజ్ కోసం చూస్తుంటే, జగన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. జగన్ పద్ధతిగా ఉండే మనిషి కాదన్నారు

Free Traffic Exchange